telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

మిసెస్ ఇండియా గా .. ఒక పోలీస్ ..

a police officer as misses india 2019

విధి నిర్వహణలో తీరికలేకుండా తలమునకలవడంతోనే పోలీసు ఉద్యోగం అనుకుంటారు అందరూ. అలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా కూడా ఒక పోలీసు అధికారిణిని మిసెస్‌ ఇండియా కిరీటం వరించింది. ఫైనల్‌లో 20 మందితో పోటీపడి మరీ విజేతగా నిలిచింది. అందంతో పాటు విజ్ఞానం ద్వారా విజేతగా నిలిచిన ఆమె ..మహారాష్ట్ర జిల్లాలోని సతారా జిల్లా కరాడ్‌ గ్రామానికి చెందిన ప్రేమ విగ్నేశ్‌ పాటిల్‌ పుణె నగర పోలీస్‌ కమిషనరేట్‌లో అసిస్టెంట్‌ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

2019 మిసెస్‌ ఇండియా పోటీల్లో పాల్గొనడమే కాకుండా ఫైనల్‌లో 20 మందితో పోటీ పడి విజేతగా నిలిచారు. ప్రేమ అందంలోనే కాదు.. చదువులోనూ గొప్ప పేరు తెచ్చుకున్నారు. కామర్స్‌లో మాస్టర్స్‌డిగ్రీ చేసిన ఆమె 2010లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు శాఖలో చేరారు. ముంబయిలోని ఠానే పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తించిన ప్రేమ.. ఎన్నో దొంగతనాల కేసుల్ని ఛేదించారు. మహిళలపై జరిగే దాడుల్ని తగ్గించేందుకు కృషిచేశారు. తన భర్త ప్రోద్బలంతోనే ఈ అందాల పోటీల్లో పాల్గొన్నట్టు పేర్కొన్న ప్రేమ.. కుటుంబ సభ్యులతో పాటు పోలీస్‌ శాఖ వారూ ఎంతో అండగా నిలిచారన్నారు. అయితే, అందాల పోటీల్లో హైహీల్స్‌తో ర్యాంప్‌ వాక్‌ చేయడం చాలా కష్టమైందని, సాధనతో ఈ సమస్యను అధిగమించినట్టు పేర్కొన్నారు.

Related posts