telugu navyamedia
telugu cinema news trending

మందులో మునిగి తేలుతున్న “షకీలా”

Shakeela

ఒకప్పుడు మలయాళ ఇండస్ట్రీలో శృంగార తారగా ఒక వెలుగు వెలిగిన షకీలా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె జీవితకథ ఆధారంగా బాలీవుడ్ లో “షకీలా : నాట్ ఏ పోర్న్ స్టార్” అనే టైటిల్ తో సినిమా రూపొందుతోంది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షకీలా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో మొత్తం బంగారంతో అలంకరించుకున్న రిచా చద్దా లుక్ అందరినీ ఆకర్షించింది.

తాజాగా ఈ చిత్రం నుంచి మరో పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ లో రిచా చద్దా మందు గ్లాసులో నిలబడి ఉండగా… “ఇస్ సాల్ కా జామ్ షకీలా కే నామ్” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. షకీలా బయోపిక్ లో… ఆమె నిజ జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను ప్రేక్షకులను చూపించబోతున్నామని దర్శకుడు ఇదివరకే ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

Related posts

చరణ్ కు అమితాబ్ బర్త్ డే గిఫ్ట్

vimala p

నా బయోపిక్ నేనే తీసుకుంటా .. అంటున్న మణికర్ణిక ..

vimala p

ప్రభాస్ పై ట్రోలింగ్ 

vimala p