telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో మరో దారుణం.. ప్రేమ పేరుతో ఓ మైనర్‌ను

కరీంనగర్ లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను ప్రేమ పేరుతో తల్లిని చేసాడు ఓ యువకుడు. పెళ్లి చేసుకొమ్మంటే ముఖం చాటేసాడు సమీర్. ఓ షాప్ లో పని చేస్తుండగా రెండేళ్ల క్రితం మైనర్ బాలికతో పరిచయం ఏర్పరుచుకున్న యువకుడు… మొదట ప్రేమ పేరిట వేధింపులకు గురి చేశాడు. బాలికను నమ్మించి శారీరకంగా వాడుకొని గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరిస్తూ వస్తున్న సమీర్.. గతేడాది నవంబర్ 12 పాపకు జన్మినిచ్చింది బాలిక. బాలికను పెళ్లి చేసుకోవాలని కూడా యువకుడితో మాట్లాడారు స్థానికులు. గర్భవతి అయిన వెంటనే చెప్పి పరారైన మోసగాడు… బయటకు విషయం చెప్తే చంపుతానని బెదిరిస్తూనే…కట్నం కోసం వేదించాడు. ఈ నెల 6 న కరీంనగర్ మహిళ పోలీస్ స్టేషన్లో న్యాయం చేయాలంటూ సమీర్ పై ఫిర్యాదు చేసింది బాధితురాలు. పోలీసులు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మైనర్ బాలిక…. పోలీసులు కూడా న్యాయం చేయలేదంటూ వాపోయింది.

Related posts