telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

15 ఏళ్ళుగా జుట్టును పెంచుకున్న అతను… కానీ ఇప్పుడు దానివల్ల…!?

Hair

అమెరికాలో రెనాల్డో అర్రోయో (23) అనే యువకుడికి తన జుట్టంటే ఎంత ఇష్టమంటే.. గత 15 ఏళ్లలో ఒక్కసారి కూడా అతడు క్రాఫ్ చేపించుకోలేదు. 15 ఏళ్ల నుంచి అమ్మాయిలా బారుగా పెంచిన జుట్టును ఇప్పుడు కత్తిరించాల్సి వచ్చింది. కారణమేంటంటే.. రెనాల్డో అమెరికా ఆర్మీలో చేరడానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆర్మీ అధికారులు ఎంపిక చేసిన జాబితాలో తన పేరు కూడా ఉండటంతో రెనాల్డోకు మొదట ఏం చేయాలో తోచలేదు. జుట్టు ముఖ్యమా.. దేశం ముఖ్యమా అని ఆలోచించాడు. చివరకు దేశమే ముఖ్యమని తెలుసుకుని జట్టు మొత్తాన్ని కత్తిరించేసి ఆర్మీ కటింగ్ కొట్టించాడు. ప్రపంచంలో ఏ దేశ ఆర్మీని చూసినా.. సైనికులు ఎంత జుట్టు ఉంచుకుంటారో తెలిసిందే. తాను ఎంతో ఇష్టంగా జుట్టును పెంచుకున్నానని.. అయితే తాను కత్తిరించుకున్న జుట్టును లాక్స్ ఆఫ్ లవ్ అనే స్వచ్చంధ సంస్థకు దానమిచ్చినట్టు రెనాల్డో తెలిపాడు. కేన్సర్ వ్యాధితో జట్టు ఊడిపోతున్న పిల్లలకు విగ్ తయారుచేసేందుకు తన జుట్టును ఉపయోగిస్తున్నందుకు తనకు ఆనందంగా ఉందని రెనాల్డో పేర్కొన్నాడు.

Related posts