telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

గూగుల్ ఆఫీస్ ముందే గూగుల్ ను మోసం చేసిన వ్యక్తి… వీడియో వైరల్

google office

ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంలో గూగుల్ మ్యాప్స్ తెలియని వారుండరు. మన వెళ్లబోతున్న దారిలో ట్రాఫిక్ ఎలా ఉంది? ఏమైనా అడ్డంకులున్నాయా? వంటి వివరాలన్నీ గూగుల్ మ్యాప్స్ చెప్పేస్తుంది. తద్వారా మనం గమ్యం చేరడానికి ఎంత సమయం పడుతుందో చిటికెలో వెల్లడిస్తుంది. అలాంటి గూగుల్ మ్యాప్స్‌ను మోసం చేశాడు సైమన్ వెకర్ట్ అనే జర్మనీవాసి. అది కూడా ఎక్కడో కాదు. బెర్లిన్‌లోని గూగుల్ కార్యాలయం ముందే. ఇంతకీ అతనీ పని ఎలా చేశాడో తెలుసా? సెకండ్ హ్యాండ్‌లో దాదాపు 100ఫోన్లు కొన్నాడు. వాటన్నింటినీ మ్యాప్స్‌కు కనెక్ట్ చేశాడు. ఆ తర్వాత వాటిని తీసుకొని గూగుల్ ఆఫీసు ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. వాటన్నింటినీ ఓ చిన్న ట్రాలీలాంటి దానిలో వేసుకొని నెమ్మదిగా నడవడం మొదలెట్టాడు. ఆ ఫోన్లు చాలా నెమ్మదిగా ముందుకు వెళ్లడాన్ని గమనించిన గూగుల్ మ్యాప్స్ బోట్ వ్యవస్థ.. కాసేపటికి అక్కడ ట్రాఫిక్ ఎక్కువైందంటూ ఆ దారిని రెడ్ కలర్‌లో చూపించడం మొదలెట్టింది. దీన్ని ఫొటో తీసిన సైమన్.. తాను గూగుల్ మ్యాప్స్‌ను మోసం చేశానంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Related posts