telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అత్యాచారం చేసిన టీనేజర్లు… తీర్పుతో షాకిచ్చిన న్యాయమూర్తులు

Judgement

అమెరికాలో అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు టీనెజర్లను నేర తీవ్రత దృష్ట్యా పెద్దలుగా పరిగణించాలని కోర్టులో దాఖలైన పిటీషన్లపై తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తులు కొత్త కాంట్రవర్సీకి తెరలేపారు. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఓ టీనేజర్ 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. తొలుత బాధితురాలిని పార్టీకి పిలిచాడు. అనంతరం ఇద్దరూ కలసి మద్యం సేవించారు. ఆ తరువాత నిందితుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, వీడియోలో రికార్డు చేసి వాట్సాప్‌లో స్నేహితులకు షేర్ చేశాడు. అంతే కాకుండా..”తొలి అనుభవమే అత్యాచారమైతే..”అంటూ ఒక క్యాప్షన్ కూడా జతచేశాడు. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో…మన్‌మౌత్ కౌంటీ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా వాదనలు విన్న న్యాయమూర్తి జేమ్స్ ట్రోయియానో..వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ఈ కేసు..ఇద్దరో ముగ్గురో పురుషులు… తుపాకీతో ఒక మహిళను బెదిరించి లొంగతీసుకోవడం లాంటిది కాదు” అని వ్యాఖ్యానించారు. నిందితుడు చేసిన వ్యాఖ్యలను ఓ ఆకతాయి కుర్రాడు కూసిన పిచ్చికూతలుగా పరిగణించాలని అభిప్రాయడ్డారు. అక్కడితో ఆగకుండా..సదరు నిందితుడు పరిక్షల్లో మంచి మార్కులు సాధించాడని..గొప్ప భవిష్యత్తు ఉన్న వాడని కితాబిచ్చారు. ఇక ఇటీవలే న్యూజెర్సీలో జరిగిన మరో ఘటనలో 16 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన మార్సియా సిల్వా అనే మహిళా న్యాయమూర్తి కూడా వివాదాస్పద కామెంట్స్ చేశారు. “జరిగిన దారుణం వల్ల బాధితురాలు కన్యత్వాన్ని మాత్రమే కోల్పోయిందని మీరు కోర్టుకు తెలిపారు. బాధితురాలికి శారీరక మానసిక గాయాలైనట్టు మీరు ఎక్కడా చెప్పలేదు” అంటూ బాధితురాలి తరఫు న్యాయవాదినుద్దేశించి వ్యాఖ్యానించారు. ఆరోపణలను ఎదుర్కుంటున్న టీనేజర్లను పెద్దలుగా పరిగణించి విచారణ చెప్పట్టేందుకు మాత్రం ఇద్దరు న్యాయమూర్తులూ నిరాకరించారు. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ బాధితులు పైకోర్టులో అప్పీలు చేసుకోవడంతో నిందితులను పెద్దలుగా పరిగణించేందుకు మార్గం సుగమమైంది. కాగా ఆ ఇద్దరు జడ్జీలను విధులనుంచి తొలగించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి.

Related posts