• Home
  • విద్య
  • సర్వేపల్లి విగ్రహానికి ప్రముఖుల ఘన నివాళి
రాజకీయ వార్తలు వార్తలు విద్య విద్య వార్తలు

సర్వేపల్లి విగ్రహానికి ప్రముఖుల ఘన నివాళి

A great tribute to the famous Sarvepalli

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని లోయర్‌ ట్యాంక్‌బండ్‌పై ఉన్న సర్వేపల్లి విగ్రహానికి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పూల మాల వేసి వేసి నివాళులు అర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో, స్వరాష్ట్రంలో అత్యున్నత విద్యా ప్రమాణాలతో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు.

ఎంపీ బండారు దత్తాత్రేయ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌, ఇతర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ వేడుకలకు హాజరయ్యారు. యావత్ దేశం, విద్యార్థి లోకానికి ఆదర్శంగా నిలిచిన సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు చిరస్మరణీమని బండారు దత్తాత్రేయ కొనియాడారు.

Related posts

కుమారస్వామి సీఎం అయ్యారు..మజ్లిస్‌ అభ్యర్ధి ఎందుకు కాలేడు.?

madhu

కనిపించకుండా పోయి ఉగ్రవాద సంస్థ జెండాలతో కనిపించిన కశ్మీరీ విద్యార్ధి

jithu j

ఐకియా బిరియానీలో గొంగళి పురుగు

jithu j

Leave a Comment