telugu navyamedia
telugu cinema news

పూనమ్, లక్ష్మీ పార్వతిలను వేధించిన ఒక్కడే…!?

Lakshmi-Parvathi-and-Poonam-Kaur

సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోలింగ్ చేయడమనేది చాలా సాధారణంగా మారిపోయింది. కానీ కొంతమంది మాత్రం తమ హద్దులు దాటి మరీ సెల‌బ్రిటీల‌ని కించ ప‌రుస్తూ వారికి సంబంధించిన అస‌భ్య‌క‌ర‌మైన పోస్ట్‌లు చేస్తుండ‌డం ఆందోళన చెందవలసిన విషయం. కొద్ది రోజుల క్రితం ల‌క్ష్మీ పార్వ‌తి, పూన‌మ్ కౌర్‌ల‌ని టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌భ్య‌క‌ర పోస్ట్‌లు చేశారు. దీనిపై వీరిరివురు పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. అయితే విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు లక్ష్మీపార్వతిపై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి, పూనం కౌర్‌పై గత 8 నెలలుగా అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల కథనాలను పోస్ట్‌ చేస్తున్నారని గుర్తించారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌‌ కేంద్రంగా ఈ వ్యవహారం సాగిస్తున్న‌ట్టు వారు పేర్కొన్నారు. ల‌క్ష్మీ పార్వ‌తి, పూన‌మ్‌ని వేధించే వ్య‌క్తి ఒక‌డే అని సైబ‌ర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ప్ర‌స్తుతం ఆ వ్య‌క్తి ప‌రారీలోగా ఉండ‌గా, అత‌ని కోసం పోలీసులు అన్వేష‌ణ సాగిస్తున్నారు.

Related posts

ఏపీకి జగన్ సీఎం కావడం సంతోషం.. :నటుడు సూర్య

vimala p

బిగ్ బాస్-3 : హౌజ్‌లో వాటర్‌ గ్యాస్‌ నిలిపివేత

vimala p

కంగనా ఘాటు వ్యాఖ్యలు… సమాధానం చెప్పిన రణబీర్

vimala p