telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌” సెన్సార్ పూర్తి

Tenali

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అనేది ట్యాగ్ లైన్‌. జ‌వ్వాజి రామాంజ‌నేయులు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రం యుబైఏ సర్టిఫికెట్‌ని పొందింది. సెన్సార్ నుంచి ప్రశంసలు అందుకున్న ‘తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌’ టీమ్.. చిత్ర విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇటీవ‌ల ఈ సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన సాంగ్స్‌కి, టీజ‌ర్‌కి, రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. హీరో సందీప్ కిష‌న్ లాయ‌ర్‌గా న‌టిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని జి.నాగేశ్వ‌రరెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. హ‌న్సిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను వరలక్ష్మి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. దీనిని ఉద్దేశించి సందీప్ ట్వీట్ చేశాడు. `గుడ్ ఆఫ్టర్‌నూన్ మేడమ్. మీరు ఎప్పుడూ పెద్ద డాన్‌లా ఉంటారు. ఎలా?` అని ప్రశ్నించాడు. దీనికి వరలక్ష్మి స్పందిస్తూ.. `హహహ.. షటప్ రాస్కెల్` అని జవాబిచ్చింది. “పబ్లిక్‌గా తిడతావా? నేను ఆన్‌స్క్రీన్ లాయర్ని. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావు. నీ మీద సెక్షన్ 503 ప్రకారం కేసు వేస్తాను” అని సందీప్ ట్వీట్ చేశాడు. వీరిద్దరి సరదా సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంది.

Related posts