• Home
  • వార్తలు
  • అభిమానం అంటే ఇదేనేమో…గుండె నొప్పిని భరించడానికి రజినీ సినిమాలు చూసిన బాలుడు
ఆరోగ్య వార్తలు వార్తలు సామాజిక సినిమా వార్తలు

అభిమానం అంటే ఇదేనేమో…గుండె నొప్పిని భరించడానికి రజినీ సినిమాలు చూసిన బాలుడు

rajinikanth

గుండె మార్పిడి చేయించుకున్న 13 ఏళ్ల బాలుడు తన సర్జరీ తర్వాత నొప్పి తట్టుకునేందుకు ఏంచేశాడో తెలుసా? తన అభిమాన నటుడు రజినీకాంత్ సినిమాలు చూశాడు! అలా కొద్దిరోజుల్లోనే అతడు కోలుకున్న తీరుపై డాక్టర్లే ముక్కున వేలేసుకుంటున్నారు. ఈనెల 6న చోటుచేసుకున్న ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని మూదలపాళ్యకు చెందిన కుశాల్ కార్డియోమయోపతితో బాధపడుతున్నాడు. గుండె బలహీనం కావడం వల్ల రక్తం సరఫరా చేసే సామర్థ్యం కోల్పోవడం దీని లక్షణం. దీంతో ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యులు అతడికి గుండెమార్పిడి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. విశాఖపట్నానికి చెందిన 20 ఏళ్ల ఓ యువకుడి గుండెను ప్రత్యేక విమానం ద్వారా తెప్పించి కుశాల్‌కు అమర్చారు.

దీనిపై ఫోర్టిస్ క్లినికల్ విభాగం డైరెక్టర్ డాక్టర్ మురళి చక్రవర్తి మాట్లాడుతూ… ‘‘‘సర్జరీ చేసిన తర్వాత ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు ఆ బాలుడు రజినీకాంత్ సినిమాలు చూస్తూ కోలుకున్నాడు..’’ అని వెల్లడించారు. కార్డియాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ వివేక్ జవలి మాట్లాడుతూ.. ‘‘కేవలం నాలుగు గంటల ఒక్క నిమిషంలో గుండెను తరలించి, ట్రాన్స్‌ప్లాంట్ చేశాం. ఇందుకు సహకరించిన నిపుణులు, గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన పోలీసులకు కృతజ్ఞతలు..’’ అని పేర్కొన్నారు. కాగా కుశాల్ కొద్ది నెలల్లోనే మళ్లీ స్కూల్‌కి వెళతాడని వైద్యులు భరోసా ఇవ్వడంతో సదరు కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. సర్జరీ కోసం ఫోర్టిస్ ఆస్పత్రితో పాటు రెండు స్వచ్ఛంద సంస్థలు ఆర్ధిక సాయం చేసి ఆదుకున్నాయి.

 

Related posts

వివాదాల్లో "రంగస్థలం"

admin

‘కృష్ణార్జునయుద్ధం’ కొత్త ప్రచారం…

admin

బంగారు తెలంగాణ ఆడియో విడుదల

admin

Leave a Comment