telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సినిమా వార్తలు హాస్యం

విమానంలో పక్షిరాజు గారికి, సీటు ఇవ్వలేదట…

సాధారణంగా పక్షులు ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి ఒక ప్రాంతం నుండి మరోప్రాంతానికి వలస వెళ్లడం చూస్తుంటాం. అయితే మరి ఈ పక్షికి సొంతగా ఎగరడం ఎందుకు అనిపించిందేమో, ఏకంగా విమానంలోకి వచ్చేసింది. ఎంచక్కా వెళ్లాల్సిన గమ్యానికి వెళ్ళిపోయింది. స్మార్ట్ బర్డ్ కదా. ఇవ్వాళా రేపు అవికూడా రైట్స్ కోసం ఫ్లైట్ లో రిజర్వేషన్ అడుగుతాయేమో.. అడిగిన అడుగుతాయి.. అసలే పక్షి ప్రేమికులకు ఈ ప్రపంచంలో అంతేలేదు. అవి కోరుకోకపోయినా, వీళ్ళు పోరాడి వాటికి సాధించిపెడతారు కూడా. ప్రస్తుత వివరాలలోకి వెళితే, విమాన ప్రయాణం చాలా ఖరీదైనది, ఇక అది కూడా బిజినెస్ క్లాసులో అంటే… ఇంకేముంది… ఫ్రీగా బిజినెస్ క్లాసులో వెళ్లాలంటే ఎంత అదృష్టమో ఉండాలి. ఈ పక్షికి అంత అదృష్టమే పట్టుకుంది. సింగపూర్ నుంచి లండన్ వరకూ 14 గంటల పాటు రూపాయి ఖర్చు లేకుండా, బిజినెస్ క్లాస్ లో కూర్చుని వెళ్లిపోయింది. ఈ ఘటన సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో జరిగింది.

విమానంలోకి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో తెలియదుగానీ, దేశదేశాలు దాటి వెళ్లిపోయింది. సింగపూర్ ఎయిర్ లైన్స్ అధికారులు సైతం దీనిపై స్పందించారు. ఈ ఘటన 7వ తేదీన జరిగిందని, ఆ పక్షి లోపలికి ఎలా వచ్చిందో తెలియదని, కాస్తంత కష్టపడి దాన్ని పట్టుకుని, లండన్ లోని జంతు సంరక్షణ అధికారులకు అప్పగించామని వెల్లడించింది. ఇక పక్షిని విమానంలో చూసిన పలువురు దాన్ని వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవన్నీ వైరల్ అవుతుండగా, ఆ పక్షి అదృష్ట పక్షని కామెంట్లు వస్తున్నాయి.

Stowaway bird found taking business class 12 hours into Singapore-London SIA flight https://www.straitstimes.com/singapore/stowaway-bird-found-taking-business-class-12-hours-into-singapore-london-sia-flight?&utm_source=whatsapp&utm_medium=social-media&utm_campaign=addtoany

Posted by Salil Kumar on Monday, 14 January 2019

Related posts