telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇక్కడ అత్యాచార బాధితురాలికే శిక్ష… 30 ఏళ్ళు… !?

Girl

ఏవ్‌లీన్ బీట్రిర్జ్ హెర్నాండెజ్ క్రజ్ అనే 19 ఏళ్ళ యువతిపై స్థానికంగా ఉండే ఓ హింసాత్మక ముఠాకు చెందిన సభ్యుడు బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో ఏవ్‌లీన్ గర్భం దాల్చింది. ఈ క్రమంలో ఒకరోజు ఆమె బాత్రూంకు వెళ్లగా తీవ్రమైన కడుపునొప్పితో గర్భస్రామైంది. కానీ అవాంఛిత గర్భధారణనను తట్టుకోలేని ఏల్‌వీన్ శిశువును చంపాలని భావించి మరుగుదొడ్డిలో విసిరినట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దాంతో టీనేజర్ తరఫు న్యాయవాది డెన్నిస్ మునొజ్ మాత్రం ఇందులో నిజం లేదని, గర్భస్రావం కారణంగానే మృతశిశువు జన్మించిందన్నారు. తన క్లయింట్ వైద్య సహాయం పొందడంలో విఫలమైందని, ఎందుకంటే ఆమె గర్భవతి అనే విషయం ఆమెకు కూడా తెలియదని కోర్టుకు విన్నవించారు. అయితే మృతశిశువు జన్మించిందా? లేదా పుట్టిన తరువాత శిశువు చనిపోయిందా? అని వైద్యులు కూడా నిర్ధారించలేకపోయారు. ఇక వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి టీనేజర్‌నే దోషిగా నిర్ధారించి ఈఏల్ సాల్వడోరన్ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

Related posts