telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సమంత చిత్రంపై విజయ్ దేవరకొండ ఎఫెక్ట్… రిలీజ్ డేట్ చేంజ్

96

శ‌ర్వానంద్, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో 96 రీమేక్ చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టు స‌మాచారం. చిత్రంలో శ‌ర్వానంద్ ఫోటోగ్రాఫ‌ర్ పాత్ర‌లో కనిపించ‌నుండ‌గా, ఆయ‌న గార్ల్‌ఫ్రెండ్ పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 14న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని దిల్ రాజు భావించారు. కాని అదే రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ నటించిన వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రం విడుద‌ల కానుంది. రెండు చిత్రాలు ఒకే రోజు విడుద‌లైతే క‌లెక్ష‌న్స్‌లో జాప్యం వ‌స్తుంద‌ని భావించిన దిల్ రాజు 96 రీమేక్ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. త్వ‌ర‌లో దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Related posts