telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : .. వైద్య శాఖలో .. ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. 9వేలపైనే ..

funds to telangana by central govt

రాష్ట్రంలో విషజ్వరాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్రంలో విషజ్వరాలు ఉన్న మాట వాస్తవమే అని మంత్రి అంగీకరించారు. కానీ.. అనవసర ఆరోపణలతో ప్రజలను భయపెట్టొద్దని విపక్షాలకు హితవు పలికారు. డెంగీ జ్వరాల్లో కూడా తీవ్రత ఎక్కువ ఉందని వైద్యులు చెబుతున్నారని మంత్రి చెప్పారు. ఆసుపత్రుల్లో సౌకర్యాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వైద్యశాఖలో 9వేల 381 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోందన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉంటూ సూచనలు ఇవ్వాలని విపక్షాలను కోరారు. కష్ట కాలంలో ఉద్యోగుల సెలవులు రద్దు చేశామన్నారు. 541 కేంద్రాల్లో శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సౌకర్యాలకు మించి ఆస్పత్రుల్లో రోగులకు చికిత్స అందిస్తుంటే అభినందించాలే తప్ప విమర్శించకూడదని హితవు పలికారు. నీతిఆయోగ్ తెలంగాణ రాష్ట్రానికి మూడో ర్యాంకు ఇచ్చిందని ఈటల గుర్తు చేశారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఆస్పత్రుల్లో ఐసీయూ ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం కావాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ వైద్యశాఖలో 12వేల 289 పోస్టులను మంజూరు చేశారని, 9వేల 381 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారని మంత్రి వివరించారు.

Related posts