telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

స్వదేశంలో పనికిరాకుండాపోయిన .. విదేశీ వైద్య విద్య.. 85% విఫలం..

85% medical students failed in entrance test

ఎప్పటి నుండో విదేశీ విద్య అంటే అదో మోజు.. చిన్నచిన్న డిగ్రీ విద్య నుండి పీహెచ్డీ వరకు విదేశాలలో చదువుతున్నవారు చాలా ఎక్కువమందే ఉన్నారు. అయితే ఇందులో వైద్య విద్యకు ప్రాధాన్యత ఉంది. దూరపు కొండలు నునుపు అన్న చందాన .. విదేశీ విద్య ఉందని మరోసారి రుజువైంది. విదేశీ వైద్య విద్య స్వదేశంలో నిలబడ లేకపోతోంది. వివిధ దేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన చాలా మంది భారతీయులు ఇక్కడ లైసెన్స్‌ పొందడంలో విఫలమవుతున్నారు. విదేశీ ఎంబీబీఎస్‌ డిగ్రీ ఉన్న దాదాపు 85 శాతం మంది విద్యార్థులు దేశంలో ప్రాక్టీస్‌ చేయడానికి లైసెన్స్‌ ఇచ్చే పరీక్షను క్లియర్‌ చేయడంలో విఫలమయ్యారని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక తెలిపింది.

2015 నుంచి 2018 మధ్య నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించిన ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యు యేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ) కోసం 61,500 మంది విదేశీ ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్లు హాజరయ్యారు. వీరిలో కేవలం 8,700 మంది మాత్రమే అర్హత సాధించగలిగారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. వీరిలో ఎక్కువ మంది స్వదేశంలో సీటు పొందడంలో విఫలమైన తరువాత ఎంబీబీఎస్‌ చదవడానికి విదేశాలకు వెళ్లిన విద్యార్థులేనని నివేదిక పేర్కొంది. అమెరికా బ్రిటన్‌ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ మిన హా ఇతర దేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థు లు దేశంలో ప్రాక్టీస్‌ చేయడానికి, ఏదైనా ఆసుపత్రిలో పని చేయడానికి ఎఫ్‌ఎంజీఈ పరీక్ష పాస్‌ అవ్వాలనేది నిబంధన. గత ఆరేళ్లలో ఎఫ్‌ఎంజీఈని క్లియర్‌ చేసిన విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 2012-13లో 28.29 నుంచి 2016-17లో 9.44 కనిష్టానికి చేరుకుందని ఆ నివేదిక పేర్కొంది.

వాస్తవానికి అఫ్ఘానిస్తాన్, ఇథియోపియా, జర్మనీ, హైతీ, హంగరీ, థాయ్‌లాండ్, జాంబియా తదితర దేశాల్లో చదివిన ఏ ఒక్క ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్‌ కూడా ఈ పరీక్షను క్లియర్‌ చేయలేకపోయారని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో మెడికల్‌ సీట్లు తక్కువగా అందుబాటులో ఉ న్నందున ఏటా భారీగా విద్యార్థులు విదేశాలకు వైద్య విద్య కోసం వెళ్తున్నారు. ఇందుకోసం వారికి అర్హత ధ్రువీకరణ పత్రం అవసరం. ఇది జనవరి 2014లో అమల్లోకి వచి్చంది. 2018లో మెడికల్‌ కౌన్సి ల్‌ ఆఫ్‌ ఇండియా 17,504 మందికి ధ్రువీకరణ పత్రా లను విదేశీ వైద్య ఆశావాదులకు జారీ చేసిందని నివే దిక పేర్కొంది. కానీ విదేశాల్లో కొన్ని వైద్య కళాశాలల్లో ప్రమాణాలు నాసిరకంగా ఉండటం వల్ల ప్రాక్టీస్‌ పరీక్షలో విఫలమవుతున్నారు. ఈ సమస్య ను పరిష్కరించడానికి ఎంసీఐ ఆధ్వర్యంలోని బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లకు పరీక్షను క్లియర్‌ చేయడానికి సాయపడే చర్యలను చేపట్టాలని నిర్ణయించింది.

Related posts