telugu navyamedia
crime news Telangana trending

తెలంగాణ : .. ఖైదీలకు .. ఉద్యోగ మేళ.. 81 మందికి ఉద్యోగాలు..

81 ex criminals placed in job mela

81 మంది విడుదల ఖైదీలకు తెలంగాణ జైళ్ల శాఖ నిర్వహించిన ఉద్యోగ మేళాలో ఉద్యోగాలొచ్చాయి. ఈ జాబ్ ఫస్ట్‌లో మొత్తం 129 మంది పాల్గొనగా 81 మంది ఉద్యోగాలు సాధించారు. మొత్తం పది కన్సల్టెన్సీ సంస్థలు ఈ మేళాలో పాల్గొన్నాయి. ఇంటర్వ్యూ అనంతరం 81 మందిని ఎంపిక చేశాయి. ఎంప్లాయిమెంట్ సెల్ ఇన్‌చార్జ్, జైలర్ అయిన శ్రీమాన్ రెడ్డి మాట్లాడుతూ.. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించడం ఇది ఐదోసారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల పలువురు ఖైదీలు విడుదలయ్యారని, వారందరికీ ఉద్యోగం తక్షణ అవసరం కావడంతో ఈ మేళాను నిర్వహించినట్టు తెలిపారు. మొత్తం 10 సంస్థలు ఈ మేళాలో పాల్గొన్నాయని, 129 మందిలో 81 మందిని ఎంపిక చేసుకున్నాయని పేర్కొన్నారు. కాగా, మిగిలిన వారికి కూడా వివిధ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు.

మహబూబ్‌నగర్‌లో మొట్టమొదటి సారిగా విడుదల ఖైదీల కోసం జాబ్ ఫెస్ట్ నిర్వహించినట్టు జైలర్ తెలిపారు. అక్కడ 175 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్టు పేర్కొన్నారు. రెండోసారి కరీంనగర్‌లో నిర్వహించి 102 మందికి, మూడోసారి హైదరాబాద్‌లో, నాలుగోసారి హైదరాబాద్‌లో నిర్వహించినట్టు తెలిపారు. శిక్షతో మారిన మనుషులైన విడుదల ఖైదీలకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటున్నందుకు ఆనందంగా ఉందని టీటీ హబ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ఫౌండర్, డైరెక్టర్ ఛక్రధర్ పేర్కొన్నారు. తమకు ఉద్యోగాలు లభించినందుకు విడుదలైన ఖైదీలు సంతోషం వ్యక్తం చేశారు.

Related posts

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా … భారీ నోటిఫికేషన్‌..

vimala p

ప్రభాస్ ల్యాండ్ నుంచి వచ్చావా ?… పూజాహెగ్డేకు షాకింగ్ అనుభవం

vimala p

మార్కెట్ లో.. బంగారం ధరలు…

vimala p