రాజకీయ వార్తలు

జమ్మూ కాశ్మీర్లో 8 మంది ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వారిని ఏరివేయడానికి భారత సైనికులు మూడుచోట్ల కాల్పులు జరిపారు. భారత సైనికులు, ఉగ్రవాదుల మధ్య హోరాహోరీగా జరిగిన ఈ కాల్పుల్లో 8మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు.

ఈ కాల్పుల సందర్భంగా భారత జవాన్లకు కూడా గాయాలైనట్టు వార్తలొచ్చాయి. జమ్మూ కాశ్మీర్లోని షోశియాన్ జిల్లా ప్రగాద్ లో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు జరిగినట్టు అధికారులు ధృవీకరించారు. ఈ కాల్పులను దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాల్లో బందోబస్తును ఎక్కువ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉగ్రవాదులను ఏరివేసినట్టు అధికారులు తెలిపారు.

Related posts

ఫుట్ బాల్ మ్యాచ్ చూసిందని… మహిళ అరెస్ట్…

chandra sekkhar

పరిపూర్ణానందను నగరంలోకి…ఘనంగా…ఊరేగింపుతో…

chandra sekkhar

ఈనెల 29 నుంచి ఎన్టీఆర్ బయోపిక్

admin

Leave a Comment