telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

ప్రత్యేక రైళ్లు : .. సికింద్రాబాద్ నుండి పలు మార్గాలకు .. 76 రైళ్లు.. రద్దీ దృష్ట్యా..

Attack Railway TTI in Danapur express

దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో, సికింద్రాబాద్ నుంచి వివిధ మార్గాల్లో 76 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బరుణి, రెక్సాల్ అండ్ నాందేడ్ నుంచి నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ బరుణి మధ్య 26 ప్రత్యేకరైళ్లు నడిపిస్తున్నట్లు తెలిపారు.

ఈ రైళ్లు సికింద్రాబాద్ నుంచి జూలై 7,14,21,28 తేదీలతోపాటు ఆగస్టు 4,11,18,25 తేదీలతోపాటు సెప్టెంబర్ 1,8,15,22,29 తేదీల్లో రాత్రి 10.15 నిమిషాలకు పేర్కొన్న తేదీల్లో బయలుదేరుతాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్ష, నాగపూర్, గోండియా, దర్గ, రాయిపూర్, బిలాస్‌పూర్, జార్సుగూడ, రూర్కే లా, రాంచి, గయ, జమాల్‌పూర్, షాహీపూర్ కమాల్, మీదుగా బరుణికి చేరుకుంటుంది.

ఇప్పటివరకు రైల్వే శాఖ సికింద్రాబాద్ నుంచి రెక్సాల్‌కు 24 ప్రత్యేక రైళ్లు నడిపించింది. జూలై 9,16,23,30 తేదీల్లో ఆగ స్టు 6,13,20,27 తేదీల్లో సెప్టెంబర్ 3,10, 17,24 తేదీల్లో ప్రతీ మంగళవారం 9.40 నిమిషాలకు చేరుకుంటుంది. ఈ రైళ్లు కూడా పైన పేర్కొన్న రూట్లలో రాకపోకలు సాగిస్తుంది. హజ్రత్ నిజాముద్దీన్ రైలు కూడా నాందేడ్ నుం చి జూలై 6,13,20,27 తేదీలతోపాటు, ఆగస్టు 3,10,17,24,31, సెప్టెంబర్ 7,14,21,28 తేదీల్లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు పూర్ణ, బస్మెట్, హింగోలి, వాషిమ్, అకోల, ఇటార్సీ, భోపాల్, బినా, ఝాన్సీ, ఆగ్రా స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఈ మార్గంలో 26 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Related posts