telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ రాజకీయ వార్తలు

73కు చేరిన .. బీహార్ చిన్నారుల మృతులు..

73 children died in bihar

మెదడువాపు వ్యాధి కారణంగా బీహార్‌ లోని ముజఫర్‌పూర్‌లో మృతి చెందిన చిన్నారుల సంఖ్య 73కి చేరింది.ఒక్క శ్రీకృష్ణ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్ లోనే 58 మంది మృతి చెందగా, కేజ్రీవాల్‌ హాస్పిటల్ లో 11మంది చనిపోయారు.వేర్వేరు హాస్పిటల్స్ లో నలుగురు చిన్నారులు మొదడువాపు వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు చిన్నారులు మెదడువాపు వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారని, వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని బీహార్‌ ఆరోగ్య శాఖ మంత్రి మంగల్‌ పాండే చెప్పారు. ఈ రెండు ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచామని తెలిపారు. చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పాండే తెలిపారు.

మెడిసిస్స్ నుంచి డాక్టర్లు వరకు అన్నీ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పాట్నా ఎయిమ్స్ నుంచి ఓ డాక్టర్,నర్సులను కూడా ముజఫర్ పూర్ కి పిలిపించినట్లు తెలిపారు.అధిక జ్వరం, తలనొప్పి లక్షణాలు ఉంటే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఇవాళ(జూన్-15,2019)కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మజఫర్ పూర్ లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజీకి వెళ్లారు. డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆదివారం(జూన్-16,2019) తాను కూడా ముజఫర్ పూర్ వెళ్లనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు.

Related posts