telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సాహో’ కు .. సెంటిమెంట్ కష్టాలు..

saaho

సాహో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో సెంటిమెంట్ తిప్పలు తప్పడంలేదు. ఈ చిత్రం మ్యానియా తీవ్ర స్థాయికి చేరిపోతూ ఉంటే ఆ మ్యానియాను దెబ్బ తీయడానికి ‘సాహో’ ప్రీ రిలీజ్ టాక్ అంటూ కొన్ని నెగిటివ్ వార్తలు కూడ హడావిడి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఎంతో ఉత్సాహంగా ఉన్న ప్రభాస్ అభిమానులకు కూడ ఒక ‘సాహో’ కు సంబంధించి ఒక నెగిటివ్ సెంటిమెంట్ కలవర పెడుతోంది. ‘సాహో’ మ్యానియాను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ మొదటి వారంలోనే అత్యంత భారీ కలక్షన్స్ రాబట్టాలని ఈ మూవీ నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ మూవీ సింగిల్ ధియేటర్ టిక్కెట్ల రేటు పెంచడం అదేవిధంగా ఈ మూవీకి ప్రతిరోజు రెండు అదనపు షోలను వేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఊళ్ళలో ‘సాహో’ మూవీని ఆగష్టు 30 నుండి సెప్టెంబర్ 5 వరకు రోజుకు 6 షోలు చొప్పున ప్రదర్శించబోతున్నారు.

ఆయా తేదీలలో తెల్లవార్లు ‘సాహో’ హంగామా ధియేటర్లలో కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. అయితే ఇక్కడే ప్రభాస్ అభిమానులకు ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఎదురౌతోంది. ఈమధ్య కాలంలో రిలీజ్ కు ముందు భారీ హైక్ క్రియేట్ చేసుకుని విడుదలైన పవన్ ‘అజ్ఞాతవాసి’ ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ మూవీలకు కూడ ఇలాగే కలక్షన్స్ విషయంలో రికార్డులు సృష్టించాలని అదనపు షోలకు గతంలో పర్మిషన్స్ తెచ్చుకుని ఆమూవీలకు వచ్చిన నెగిటివ్ టాక్ ల రీత్యా రెండవరోజు నుండే అదనపు షోలను రద్దు చేసుకున్నారు. ఈ సమ్మర్ రేస్ కు వచ్చిన మహేష్ ‘మహర్షి’ కి డివైడ్ టాక్ వచ్చిన నేపధ్యంలో ఈసినిమా అదనపు షోలను కూడ మూడవరోజు నుండి రద్దు చేసారు. ఇలాంటి పరిస్థుతలలో ఈ నెగిటివ్ సెంటిమెంట్ ఊహించని విధంగా ‘సాహో’ కు కూడ ఎదురౌతుందా అంటూ లోలోపల ప్రభాస్ అభిమానులు కలవర పడుతున్నట్లు టాక్.

Related posts