telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పౌరసత్వ చట్టం కాక .. రిఫరెండం అవసరమన్న మమతా…

mamata-banerjee

పౌరసత్వ చట్టం పై దేశవ్యాప్తంగా రిఫరెండం నిర్వహించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థతో పాటు దేశంలో శాంతిని కూడా బీజేపీ ప్రభుత్వం సమాధి చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే పౌరసత్వ సవరణ చట్టం కారణంగా భారత పౌరులెవరికీ నష్టం లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీకి దమ్ముంటే సీఏఏ, ఎన్నార్సీపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సవాల్ విసిరారు. ఈ రెఫరండంలో బీజేపీ ఓటమి పాలైతే అధికారం నుంచి తప్పుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయిన తర్వాత.. ఇప్పుడు భారత పౌరులుగా నిరూపించుకోవాలా అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశంలో శాంతిని, సామరస్యాన్ని కూడా మోడీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని కాంగ్రెస్ మండిపడింది.

ముందు చూపు లేని అనాలోచిత నిర్ణయాలతో కేంద్రం.. తనకు తానుగా అశాంతిని రాజేసిందని ఆరోపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు పూర్తి బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేసింది. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు మొత్తుకున్నా కేంద్రం వినిపించుకోలేదని, ఇప్పుడు ప్రజాగ్రహం వెల్లువెత్తుతోందని అభిప్రాయపడింది. సీసీఏకు సంబంధించి నిబంధనలు, విధివిధానాలు పూర్తిగా ఖరారు కాలేదని పేర్కొన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కానీ ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత చట్టం నిబంధనలపై ప్రతీ ఒక్కరితో చర్చించి.. అర్హులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Related posts