telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ సూపర్ క్లాసిక్ అందాల పోటీలు.. 63ఏళ్ళ శోభాదేవికి దక్కిన కిరీటం..

63 years women got title in telangana beauty contest

రాష్ట్రంలో జరిగిన సూపర్ క్లాసిక్ కేటగిరీ అందాల పోటీ లో డాక్టర్ నక్కాన శోభాదేవి విజేతగా నిలిచి కిరీటం దక్కించుకున్నారు. లండన్ లో ప్రఖ్యాత వైద్యురాలిగా శోభాదేవికి గుర్తింపు ఉంది. ఆమె రెండు దశాబ్దాల పాటు లండన్ లో వైద్య సేవలు అందించారు. అయితే మాతృభూమికి ఏదైనా చేయాలన్న తపనతో భారత్ వచ్చిన శోభాదేవి హైదరాబాద్ లోని లైఫ్ స్పాన్ ఆసుపత్రిలో డయాబెటాలజిస్ట్ గా పనిచేస్తున్నారు.

ఆమెకు వైద్యం వృత్తి అయితే ఫ్యాషన్ రంగం ప్రవృత్తి అని చెప్పాలి. ఆ మక్కువతోనే మిసెస్ ఇండియా తెలంగాణ అందాల పోటీల్లో పాల్గొనడమే కాదు ఏకంగా టైటిల్ ఎగరేసుకెళ్లారు. ఇంతటి ఘనత సాధించిన శోభాదేవి వయసు 63 సంవత్సరాలు.. ఈ వయసులోనూ అందాల పోటీలలో పాల్లొని అందరి మనసులు గెలుచుకుని టైటిల్ సాధించారు.

Related posts