telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఫొని తుపాను తో .. ఒడిశాలో ఆరుగురు మృతి..

6 died in odisha on fani cyclone

ఒడిశాలో ఫొని తుపాను బీభత్సానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 80-125 కి.మీ. వేగంగా పెనుగాలులు, అతి భారీ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు ధ్వంసమైపోయాయి. చాలా చోట్ల విద్యుత్‌ సంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో ఒడిషాలో హై అలర్ట్ ప్రకటించారు. పర్యాటకులందరూ పూరీ విడిచి వెళ్లాలని ఆదేశించారు. ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు ఒడిషా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటివరకు 11 వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు చెప్పారు. తూర్పు తీర ప్రాంత ప్రజలు తుఫాన్ వల్ల ఇబ్బందులు పడుతున్నారని, ఆయా రాష్ట్రాలతో కేంద్రం నిరంతరంగా టచ్‌లో ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. ఒడిషా, బెంగాల్‌, ఆంధ్రా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోందన్నారు.

Related posts