telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

విపరీతంగా పెరిగిన పెట్టుబడులు.. ఒక్కసారే 6లక్షల కోట్లకుపైగా..

slight positive trend in stock markets

నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్నుల విధానంపై చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్‌లో విపరీతమైన లాభాలను చవిచూశాయి.. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాడు దేశీయ కంపెనీలకు సెస్, సర్ చార్జీలు మొత్తం కలిపి కార్పొరేట్ ట్యాక్స్ ను 25.17శాతానికి తగ్గిస్తూ ఇవాళ ఆమె చేసిన ప్రకటనతో BSE-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్.. ఒక్క రోజులోనే 1.45లక్షల కోట్ల నుంచి రూ .6.82 లక్షల కోట్లకు పెరిగింది. దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులకు ఇది అద్భుతమైన శుక్రవారంగా మిగిలింది.

గత పదేళ్లలో ఇవాళే అత్యధికంగా మదుపరులు లాభపడ్డారు. దీపావళి ముందుగానే వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. నేటి ప్రకటనతో దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. 2017లో కూడా అమెరికాలో ట్రంప్ సర్కార్ ఇలాగే కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసిన తర్వాత ఆ దేశ ఆర్థికవ్యవస్థ మరింత బలమైనదిగా మారిందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ సీఈవో రాజీవ్ సింగ్ తెలిపారు.

Related posts