telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఐదోసారి రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధం…

firing on nrc protests 3 died

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులతో ప్రభుత్వం సంప్రదింపులను కొనసాగిస్తోంది. ఇప్పటికి ప్రభుత్వం నాలుగు సార్లు రైతులతో నాలుగు సార్లు భేటి అయ్యారు. అయితే ఈ రోజు కేంద్ర, రైతుల మధ్య ఐదో రౌండ్ భేటిని నిర్వహించనున్నారు. అయితే వ్యవసాయ బిల్లలకు వ్యతిరేకంగా ఎంతోమంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారు. దీనిపై స్పందించిన కేంద్రం సంప్పదింపులకు తెరతీసింది. అయితే గురువారం కేంద్రం, రైతుల మధ్య నాలుగో దశ సమావేశం జరిగింది. దీనికోసం పార్లమెంటు స్పెషల్ సిషన్‌ను ఆపుకోనైనా రైతుల సమస్యను తీర్చాలని రైతుల నాయకులు అంటున్నారు. అంతేకాకుండా రైతులతో చర్చల తరువాత కేంద్రం ఎటువంటి ఈగోను చూపడంలేదని, ఓపెన్ మైండ్‌తోనే అన్ని సమస్యలను చూస్తుందని, అదేవిధంగా రైతులసమస్య గురింది చర్చలు జరుపుతుందని వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ అన్నారు. ‘రైతుల సమస్యలపై కేంద్రం చర్చలు జరుపుతోంది. అన్నింటికి పరుష్కారం లభిస్తుంది. ఈ శుక్రవారం జరిగే చర్చల ద్వారా ఈ సమస్య తుది దశకు చేరాలని కోరుకుంటున్నా’ని తోమార్ అన్నారు. అయితే ఎంఎస్‌పీని ఎవరు ముట్టుకోరని, ఏపీఎంసీ, మండీస్‌ల బయట కూడా సమానంగా ఉండేలా ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుంటుందని రైతులకు తెలిపారు. రైతుల సమస్యను ప్రభుత్వం అన్ని సమస్యలలానే చూస్తుంది, తమకు వ్యతిరరేకంగా ఏమీ ఆలోచించడంలేదని, మొదట జరిగిన సమావేశంలో రైతులు ప్రభుత్వం ఇచ్చిన టీని కూడా తిరస్కరించి మేము ఇక్కడికి టీ కోసం రాలేదని, తమ హక్కులను తీసుకునేందుకు వచ్చామని రైతులన్న తీరును తెలిపారు.

Related posts