telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

5జి చిప్ లతో.. లాప్ టాప్ లు..

5g intel processors in computers soon

ప్రస్తుతం మీరు వాడుతున్న ల్యాప్‌టాప్‌లు మరియు డెస్క్ టాప్‌లలో కూడా 5G మద్దతుతో రాబోతున్నాయి. ఇందుకోసం ప్రముఖ తైవానీస్ చిప్‌మేకర్ 5G మోడెమ్‌లను తయారుచేస్తున్నట్లు తెలిపారు. మీడియాటెక్ సంస్థ యొక్క కొత్త 5G మోడెమ్‌లను PC మరియు ల్యాప్‌టాప్‌లకు అందివ్వడానికి ఇంటెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు తైవానీస్ చిప్‌మేకర్ తెలిపారు. ఇంటెల్ మరియు మీడియాటెక్ యొక్క 5G సొల్యూషన్ ల్యాప్‌టాప్‌లను అందించే మొదటి తయారీదారులలో డెల్ మరియు హెచ్‌పి ఉంటుందని భావిస్తున్నారు. ఈ పరికరాల యొక్క మొదటి రోల్ అవుట్ 2021 ప్రారంభంలో ఉంటుందని మీడియాటెక్ తెలిపింది.

ఈ భాగస్వామ్యం ద్వారా ఇంటెల్ సంస్థ మీడియాటెక్‌తో కలిసి వినియోగదారులకు 5G అనుసంధానిత కీలకమైన వాణిజ్య ల్యాప్‌టాప్ విభాగాలలో విస్తరణ కోసం పనిచేస్తోంది. ఇప్పుడు మీడియాటెక్ 5G మోడెమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఎదురయే సమస్యల పరిష్కారం కోసం చాలా మంది భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. ల్యాప్‌టాప్‌లలో కొత్త స్థాయి 5G ఆధారంగా కంప్యూటింగ్ మరియు కనెక్టివిటీని రెండిటిని విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. దీని ద్వారా ప్రపంచంతో సంభాషించే విధానం కూడా మారుతుంది అని ఇంటెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు క్లయింట్ కంప్యూటింగ్ గ్రూప్ జనరల్ మేనేజర్ గ్రెగొరీ బ్రయంట్ అన్నారు.

Related posts