telugu navyamedia
business news news Technology trending

టెక్ తో .. ఉద్యోగాలు పోతున్నాయి.. 541 మందిని ఇంటికి పంపేసిన జొమాటో..

541 employees out from zomato

ఎప్పటికప్పుడు సరికొత్త టెక్ ను పరిశ్రమలు తెచ్చిపెట్టుకుంటుండటంతో మానవ వనరులకు పని లేకుండాపోతుంది. దీనితో ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. తాజాగా, ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత బాట్స్‌, ఆటోమేషన్‌ టెక్నాలజీతో కస్టమర్లకు దగ్గర కావాలని భావిస్తున్న ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ, రెస్టారెంట్‌ డిస్కవరీ ప్లాట్‌ఫాం సంస్థ జొమాటో 10 శాతం మంది ఉద్యోగులపై వేటేసింది.

గుర్గావ్‌లోని జొమాటో ప్రధాన కార్యాలయంలో కస్టమర్‌, వ్యాపార, డెలివరీ భాగస్వామిక సహాయక బృందంలోని 541 మందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తొలగించిన ఉద్యోగులకు రెండు నెలల వేతనంతోపాటు జనవరి 2020 వరకు ఫ్యామిలీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం అందిస్తున్నామని తెలిపింది. ఉద్యోగులను తగ్గించిన తర్వాత ప్రస్తుతం జొమాటాలో ఇంకా 5 వేల మంది పనిచేస్తున్నారు.

Related posts

పవర్‌గ్రిడ్ లో … ఎగ్జిక్యూటీవ్ ట్రైనీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

vimala p

కొత్త పార్టీలకు .. ఈసీ గుర్తులు ఇవే.. !

vimala p

అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌ : “సాహోరే స‌భా ప్రాంగ‌ణం…” వీడియో సాంగ్

vimala p