telugu navyamedia
crime news trending

రాజధానిలో .. 5వేలకోట్ల మాదకద్రవ్యాల పట్టివేత..

5000 cr heroin caught in delhi

దేశరాజధానిలో మరోసారి భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు అధికారులు. దీనివెనుక ఉంది నడిపిస్తుంది తాలిబన్ నాయకుడని, అతగాడి ఆధ్వర్యంలో నడుస్తున్న భారీ హెరాయిన్ రాకెట్ గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టుచేశారు. 120 రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం ఈ చీకటి వ్యాపారాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ మూఠా రూ.5 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ను దేశంలోకి సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీ, అమృత్‌సర్ మధ్య చక్కర్లు కొడుతున్న ఆరు కార్లతో కూడిన కాన్వాయ్‌పై నిఘా పెట్టిన ఖాకీలు ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఇద్దరు రసాయన నిపుణులతోపాటు ఐదుగురు స్మగ్లర్లను తొలుత అరెస్ట్ చేసిన పోలీసులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. సరుకును కొనుగోలు చేసిన ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related posts

తెలంగాణలో మళ్ళీ పెరిగిన కేసులు…

Vasishta Reddy

ఆధార్ లింక్ : .. ఇకమీదట .. సామజిక మాధ్యమాలకు కూడా ..

vimala p

ఎన్నికలలో .. 78 మంది మహిళల విజయం..

vimala p