telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

వోక్స్ వ్యాగన్ పై .. భారత్ ఎన్జీటీ 500 కోట్ల భారీ జరిమానా.. !

500 crore penalty on volkswagen

జర్మన్ ఆటోమొబైల్ సంస్థ వోక్స్ వ్యాగన్ పై భారత్ కు చెందిన జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) కొరడా ఝుళిపించింది. కర్బన ఉద్గారాలను వెలువరించినందుకు ఏకంగా రూ.500 కోట్ల భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 2 నెలల్లోపు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వోక్స్ వ్యాగన్ డీజిల్ కార్లలో వాడే ఓ పరికరం కారణంగా పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలుగుతోందని కేసు నమోదయింది.

ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని బెంచ్ తొలుత నష్టనివారణ చర్యల కింద రూ.100 కోట్లను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి, భారీ పరిశ్రమల శాఖ, నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, ఆటోమేటివ్‌ రీసర్చ్‌ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ విచారణలో వోక్స్ వ్యాగన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో ఆ సంస్థకు రూ.500 కోట్ల భారీ జరిమానా విధిస్తూ ఎన్జీటీ తీర్పు ఇచ్చింది.

Related posts