telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ విద్యా వార్తలు

ఆర్‌పీఎఫ్‌ లో .. మహిళలకు 50 శాతం కేటాయింపు.. : రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌

50 % reservation on rpf to women

మహిళల కల నెరవేరుతుంది. 50 శాతం రిజర్వేషన్ కావాలని చేసిన పోరాటం ఫలితాలను ఇస్తుంది. దానికి సూచనా ప్రాయంగా ప్రస్తుతానికి, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌)లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్‌ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కేటాయించనున్నట్లు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ రాజ్యసభలో ప్రకటించారు. ఖాళీగా ఉన్న 9,000 పోస్టుల్లో మహిళలకు సగం అంటే 4,500 పోస్టులు దక్కనున్నాయి. ‘ప్రస్తుతం ఆర్‌పీఎఫ్‌లో మహిళా కానిస్టేబుళ్లు 2.25 శాతం మాత్రమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ఖాళీల్లో ఎక్కువగా మహిళలను నియమించాలని మోదీ నిర్ణయించారు’ అని గోయల్‌ బదులిచ్చారు.

బిహార్‌ ప్రభుత్వం మాదిరి ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని కేంద్రం పరిశీలిస్తుందా? అన్న ప్రశ్నకు ‘ఇప్పటివరకైతే అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు..’ అని మంత్రి చెప్పారు. రైల్వే ప్రైవేటీకరణ అంశంపై సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు సురేంద్ర అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ..రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు వంటి ప్రీమియం రైళ్లతో పాటు రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించాలన్న ఉద్దేశమేమీ కేంద్రానికి లేదని పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు.

Related posts