telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీసీఎం : … కేబినేట్ లో .. ఐదుగురు లంచగొండులు.. ఉద్వాసన తప్పనిసరి..

apcm committee on school fee

ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్లోని ఐదు మంది మంత్రులకు త్వరలోనే ఉద్వాసన పలకనున్నారంటూ ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అవినీతి వ్యవహారాల్లో తలదూర్చిన ఐదు మంది మంత్రుల వ్యవహార శైలి పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తన మొదటి కేబినెట్ భేటీలోనే అవినీతి పట్ల కఠినంగా వ్యవహరిస్తానని చెప్పిన జగన్, చెప్పినట్లుగానే ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపించిన ఐదు మంది మంత్రులను పిలిచి క్లాస్ పీకారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ జాబితాలో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నారని , ఆమె నిర్వహిస్తోన్న శాఖలో అన్నీ తానే అన్నట్లు ఈమె భర్తే వ్యవహరిస్తుండటం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసి, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. ఇక తన సొంత జిల్లాకు అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తోన్న ఓ సీనియర్ మంత్రి వ్యవహార శైలి పట్ల కూడా జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి.

ధర్మబద్ధమైన శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఒక మంత్రి అప్పుడే రెండు కోట్లు లంచం కోసం చేతులు చాచారన్న గుస, గుసలు విన్పించడం తో జగన్ ఆయన వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు… సదరు మంత్రిని పిలిచి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు కూడా వైకాపా వర్గాలు వెల్లడించాయి. తన మంత్రిత్వశాఖలో అప్పుడే కాంట్రాక్ట్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక మంత్రి పై కూడా వేటు తప్పదని తెలుస్తోంది క్యాబినెట్ ఏర్పాటుచేసి నెలన్నర కాకముందే ఐదు మంది మంత్రుల వ్యవహార శైలి పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి గా ఉండడం వారిని తప్పించాలని చూస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Related posts