telugu navyamedia
రాజకీయ వార్తలు

చిదంబరానికి నాలుగు రోజుల సీబీఐ కస్టడీ

congress chidambaram

ఐఎన్ఎక్స్ కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26వ తేదీ వరకు చిదంబరం సీబీఐ కస్టడీలో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇరు వాదనలను విన్న కోర్టు 30 నిమిషాల పాటు తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం సాయంత్రం 06:45 గంటలకు కోర్టు తీర్పును వెల్లడించింది.

చిదంబరం ప్రతి రోజూ కుటుంబసభ్యులను కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. లాయర్లను కూడ కలుసుకొనేందుకు సీబీఐ కోర్టు వీలు కల్పించింది. తీర్పు తర్వాత కోర్టు నుండి సీబీఐ కార్యాలయానికి మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని తరలించారు. ముందస్తు బెయిల్ కోసం చిదంబరం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఈ పిటిషన్ పై ఈ నెల 25వ తేదీన విచారణ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Related posts