telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

9న రైతుల ఖాతాలోకి .. నాలుగో విడత రుణమాఫీ ..

TDP Change Puthalapattu Candidate

అన్నదాతకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు రూ. 4వేలు అందించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా రుణమాఫి నాలుగోవిడత డబ్బులను ఈనెల 9న విడుదల చేయనుంది. ఐదో విడత రుణమాఫి కూడా రెండు మూదు రోజుల్లోనే రైతుల బ్యాంక్ అకౌంట్లలో పడనుంది నాలుగోవిడత రుణమాఫి కింద 9న రూ. 3,600 కోట్లను ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించింది. తాను అధికారంలోకి వస్తే అన్నదాతలకు రుణమాఫి చేస్తానని చంద్రబాబు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మొత్తం రూ 25వేల కోట్లను ఐదు విడతలలో మాఫీ చేస్తామని ప్రకటించారు.

ఇప్పటికే మూడు విడతల్లో రూ. 15,670 కోట్లను రైతులకు విడుదల చేసింది. 4,5 విడతల కింద రూ. 8వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రూ 50 వేల లోపు రుణాలు ఉన్న 23,45,000 మంది రైతులకు రూ. 4,337కోట్లను ఒకే విడతలో మాఫీ చేసింది. ఇవి కాకుండా కౌలు రౌతులకు 1,39,586 మందికి రూ. 496 కోట్లు విడుదల చేసింది. ఇక లక్షన్నరలోపు రుణం ఉన్నవారికి ఐదు విడతలుగా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరందరికి రుణ ఉపసంహరణార్హత పత్రాలను ప్రభుత్వం చెల్లించబోయే వాయిదాలకు 10 శాతం వడ్డీతో కలిపి చెల్లిస్తామని బాండ్లను రైతులకు ఇచ్చేసింది. ఈ విధంగా రాష్ట్రంలో 58,29,000 మంది రైతులకు రూ. 15,670 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది.

Related posts