telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

దీనివెనుక .. మతలబ్ ఏంటి.. ? యాదృచ్చికమా..!

48.2 overs in india-australia odi secret

భార‌త్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో అరుదైన విష‌యం చోటు చేసుకుంది. ఈ సిరీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య మూడు వ‌న్డే మ్యాచ్‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా 48.2 ఓవ‌ర్ల పాటు మాత్ర‌మే బ్యాటింగ్ చేయ‌డం విశేషం. హైద‌రాబాద్‌లో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన‌ ఆస్ట్రేలియా 236 ప‌రుగులు చేసింది. ఛేద‌నకు దిగిన టీమిండియా 48.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది.

అనంత‌రం నాగ్‌పూర్‌లో జ‌రిగిన రెండో వ‌న్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 48.2 ఓవ‌ర్ల‌లో 250 ప‌రుగుల‌కు ఆలైటైంది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక ఓట‌మి పాలైంది. తాజాగా రాంఛీలో జరిగిన మూడో వ‌న్డేలో 314 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 48.2 ఓవ‌ర్ల‌లో 281 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇలా మూడు మ్యాచ్‌ల్లోనూ 48.2 ఓవ‌ర్లు మాత్ర‌మే టీమిండియా బ్యాటింగ్ చేయ‌డం విశేషంగా మారింది.

Related posts