telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

రోజు 40 పుషప్స్ తో .. మీ ఆరోగ్యం మీ చేతులలోనే..

40 pushups will make you healthy

అసలు శరీరం అలసిపోయే పనే లేకుండా ప్రతిదానికి ఏదో ఒక మెషిన్ వాడేస్తున్నాం ప్రస్తుత జీవనవిధానంలో. దీనితో శరీరానికి కావాల్సిన కనీస వ్యాయామం లేకపోవటంతో, పనితీరులో మార్పులు చోటుచేసుకొంటున్నాయి. దానినే దీర్ఘకాలంలో వ్యాధులుగా తెలుసుకుంటున్నాం. అలా కాకుండా, ముందే మేల్కొని రోజు కొద్దిసేపు వ్యాయామం చేస్తే, చక్కటి ఫలితం ఉంటుంది అంటున్నారు వైద్యులు. అదికూడా రోజూ 40 పుషప్స్ తీస్తే చాలంటున్నారు. ఇక నేడు మనం తినే తిండి నుంచి పీల్చేగాలి వరకు అన్ని కలుషితమే. ఆరోగ్యంగా ఉండాలంటే దైనందిన జీవితంలో వ్యాయామం ప్రతి ఒక్కరికీ అవసరం అనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఉదయం లేవగానే 40 నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయమాలు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని పలు పరిశోధనలు తేల్చాయి. అయితే మార్నింగ్ చేసే వర్కౌట్‌లో 40 పుష్-అప్స్ చేయడం ద్వారా కార్డియోవాస్క్యులార్ వ్యాధులు(గుండె సంబంధిత ) రాకుండా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.

రోజూ 10 పుష్-అప్స్ చేసేవారి కంటే అదనంగా 30 చేసేవారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం 96 శాతం తక్కువని పరిశోధనలలో తేలినట్లుగా ఆ పత్రిక పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలు మహిళలు, ఇతర వయస్సుగల పురుషులు, తక్కువ చురుగ్గా ఉండేవారికి వర్తించవని పరిశోధకులు తెలిపారు. హార్వార్డ్ చెందిన ఇండియానా యూనివర్సిటి..ఇతర పరిశోధన సంస్థలతో కలిసి ఈ పరిశోధనను నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా 1500 మంది అగ్నిమాపక సిబ్బంది ఆరోగ్య సమాచారాన్ని సేకరించింది. పరిశోధకులు వారిపై ఏడాది పాటు వైద్యపరీక్షలు నిర్వహించి రోజూవారీ జీవన విధానాన్ని పరిశీలిస్తూ వచ్చారు.

అలాగే వారి వ్యాయామ సమయంలో 80 పైగా 10 పుష్-అప్స్ చేయాల్సిందిగా సూచించారు. సహజమైన వర్క్‌వుట్స్‌పై ‌దృష్టిపెట్టాలని చెప్పారు. సగటు వయస్సు 39.6 ఏళ్లు ఉన్న 1,104 మంది పురుష ఫైర్‌ఫైటర్ల హెల్త్ డేటాను విశ్లేషించారు. ఆ పరిశీలనలో 10 ఏళ్లలో 37 హృదయ సంబంధ జబ్బులు మాత్రమే బయటపడ్డాయి. “ఇతర వ్యాయామలతో పోలిస్తే పుషప్స్ చేయడం చాలా సులువైన పద్థతి. అలాగే హృదయ సంబంధ జబ్బుల రిస్క్ కూడా తగ్గుతుంది” అని హార్వర్డ్ టీ.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లీడ్ ఆథర్ జస్టిన్ యాంగ్ తెలిపారు.

Related posts