telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సామాజిక

టీటీడీ లో .. మరో వివాదం.. స్వామి ఆదాయ లెక్కలు చూసే 40 మందికి ఉద్వాసన..

40 employees out from ttd become an issue

ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, సిబ్బంది తొలగింపు అంశంపై తాజాగా మరో వివాదానికి కేంద్రబిందువు అయ్యేలా కనిపిస్తున్నారు. పరకామణిలో పనిచేస్తున్న 40 మంది మజ్దూర్లను గుట్టుచప్పుడు కాకుండా తొలగించారని, దీనితో స్వామి వారి ఆదాయ లెక్కింపు పనులు నిలిచిపోయాయని సమాచారం. స్వామి వారికి రోజూ హుండీ ద్వారా రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇందులో నగదు, బంగారం, ఇతరత్రా వస్తువులు ఉంటాయి. వీటిని ఏ రోజుకారోజు వేరుచేసి వివరాలు నమోదు చేసి టీటీడీ ట్రెజరీలో జమ చేయడం ఆనవాయితీ.

మజ్దూర్ల తొలగింపుతో కేవలం నోట్ల లెక్కింపు తప్ప మిగిలి రూపాల్లోని ఆదాయాన్ని లెక్కించడం లేదని తెలిసింది. దీనివల్ల బంగారం, ఇతర వస్తువులు పేరుకు పోతున్నాయని, తక్షణం టీటీడీ అధికారులు తమకు సిబ్బంది కేటాయించాలని పరకామణి నిర్వాహకులు కోరుతున్నారు. ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి అప్రైజర్‌ లేకుండా పరకామణి కొనసాగుతుండగా, ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా మజ్దూర్ల తొలగింపు నిర్ణయంతో మరోవివాదం నెలకొనేలా కనిపిస్తోంది.

Related posts