telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమెరికాలో కాల్పులు : నలుగురు మృతి

అమెరికాలోని క్యాపిటల్‌ భవనంలో జరిగిన కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. పోలీసుల కాల్పుల్లో ఓ మహిళ చనిపోగా.. మరో ముగ్గురు ఘర్షణల్లో గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు వాషింగ్టన్‌ డీసీ పోలీసులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ బుధవారం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంలోకి దూసుకొచ్చారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనకారులను నిలువరించేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువు ప్రయోగించాయి. ఈ క్రమంలో కాల్పలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒక మరో ముగ్గురు ఘర్షణల్లో గాయపడి మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. క్యాపిటల్‌ భవనంలో కాల్పుల నేపథ్యంలో వాషింగ్టన్‌ డీసీలో మేయర్‌ మురియెల్‌ బౌజర్‌ కర్ఫ్యూ విధించారు. అత్యవరసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ కర్ఫ్యూ 15 రోజుల పాటు కొనసాగనుందని కూడా పేర్కొన్నారు.

Related posts