telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

సుజనా చౌదరి కార్యాలయాలపై ఈడీ దాడి .. 4 డైరెక్టర్లు అరెస్ట్..

4 directors arrested from sujana chowdary offices

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన సీబీఐ, ఈడీ బృందాలు నలుగురు డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. సుజనా కంపెనీల్లో పని చేస్తున్న డైరెక్టర్లు జీ శ్రీనివాసరాజు, వెంకటరమణారెడ్డి, పి.సుధాకర్‌ రెడ్డి, వెంకటకల్యాణ్‌ రాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిన్నటి దాడుల్లో పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు, కర్ణాటకలో ‘బెస్ట్‌ అండ్ కాంప్టన్‌’ పేరిట సుజనా నిర్వహించే వ్యాపారం గురించి వివరాలు సేకరించారు.

ఈ సంస్థ తప్పుడు ఇన్‌ వాయిస్‌ లను క్రియేట్ చేసి బ్యాంక్ నుంచి రుణాలు పొందినట్లు గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే సంస్థపై మనీలాండరింగ్ కేసును కూడా సీబీఐ నమోదు చేసింది. ఆపై ఇదే కేసు సీబీఐకి బదిలీ అయింది. ఈ కేసులో ఆంధ్రాబ్యాంక్‌ నుంచి తీసుకున్న రూ. 71 కోట్లను ఎగవేసినట్లు సుజనాచౌదరిపై ఆరోపణలున్నాయి. తాము అదుపులోకి తీసుకున్న డైరెక్టర్లను ప్రస్తుతం విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Related posts