పామును మింగిన మరో నాగుపాము… అనంతరం బుసలు కొడుతూ

అడవులను నరికి ఇతర ప్రాణాలులకు నిలువనీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వాలు… దీనితో జనావాసాలలోకి జంతువులు రావటం, వాటిని చూసి ప్రజలు భయబ్రాంతులకు గురి అవటం సహజం అయిపొయింది… అలా అడవుల్లో, పుట్టల్లో ఉండాల్సిన పాములు తలదాచుకోవడానికి జనావాసాలకు వస్తున్నాయి… కాగా ఇటీవలే ఒడిశా పూరీ జిల్లాలోని హరీశ్ చంద్ర పరిదా నివాసంలోకి నాగుపాము చొరబడింది.. కాగా ఇంట్లో పాము కనిపించే సరికి ఒక్కసారిగా భయంతో కేకలు వేస్తూ బయటకొచ్చిన హరీష్ చుట్టుపక్కల వారందరిని పిలిచి విషయం చెప్పాడు..

 

4.5 Feet Cobra eat another snake Video Viral

దీనితో వెంటనే కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు స్నేక్ హెల్ప్ లైన్ నంబర్ కి ఫోన్ చేసి విషయం చెప్పగా వారొచ్చి సుమారు నాలుగున్నర ఫీట్ల నాగుపామును పట్టుకున్నారు… కాగా ఆ పాము అప్పటికే మరో పామును మింగి అవస్థలు పడింది.. తీవ్ర అవస్థలు పడుతూ నోట్లోనుంచి మరొక పామును కక్కేసింది… ఇక దాని విశ్వరూపాన్ని చూసిన వారందరు భయాందోళనలకు లోనయ్యారు… అయితే నోట్లోనుంచి మరొక పామును బయటకు కక్కిన తరువాత ఆ నాగుపాము బుసలు కొడుతూ అందరిని భయానికి గురిచేసింది.. కాగా పాములు పట్టుకునే అధికారులు దాన్ని పట్టుకొని వెళ్లిపోయారు.. కాగా దీనికి సంబందించిన వీడియోను సామజిక మాధ్యమాల్లో ఉంచగా అదికాస్త వైరాలయ్యింది..

నింగి-నేల ఒక్కటైన అద్భుత దృశ్యం… కోట్ల మందిని ఆకట్టుకుంటుంది

సాధారణంగా భూమి ఆకాశం ఒక్కటైనట్టు కనిపించే దృశ్యాలు ఏ బీచు ఒడ్డున నిలబడి చూసినా కనిపిస్తుంది… కానీ భూమి-ఆకాశం ఒక్కటైన చోటు ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశారా?.. అసలు అది సాధ్యమేనా? సాధ్యమే అన్న విధంగా టిబెట్ లో జరిగిన ఓ అద్భుత దృశ్యం చెబుతుంది… అయితే మనం అనుకోవచ్చు ఆకాశం అందనంత ఎత్తులో ఉంటుంది ఎలా తాకగలదు… అదే కదా మీ ఆలోచన.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమైతుంది… ఆ వీడియో చూస్తే గనక ఆకాశం వచ్చి నేలపై పడిందా అన్నట్లు కనపడుతుంది.. టిబెట్ లోని ఓ ప్రాంతంలో దట్టంగా ఉన్న మేఘాలు ఒక్కసారిగా భూమిని తాకాయి.. దీనితో వాహనాల రాకపోకలు జరగలేదు..

సరిగ్గా ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు ఆ అరుదైన దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు… టిబెట్ సముద్ర మట్టానికి 4900 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఎందుకంటే టిబెట్ ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంగా… ప్రపంచ పై కప్పుగా ప్రసిద్ధి చెందింది… ఎత్తైన పర్వతాలు కూడా చాలా ఉన్నాయి… నేపాల్ సరిహద్దులో ఉన్న ఎవరెస్ట్ పర్వతం టిబెట్ భూభాగానికి దగ్గరల్లోనే ఉంటుంది… అలాంటి ప్రదేశంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది.. కాగా ఈ వీడియో యూట్యూబ్ లో ఒక్కరోజుకే కోట్లాది వివ్యూస్ సొంతం చేసుకుంది…

ఉష్ణోగ్రతల కారణంగా జనావాసాలు చాలా తక్కువగా ఉండే టిబెట్ లో కాళీప్రదేశాలే ఎక్కువగా ఉంటాయి.. ఎప్పుడు ఆకాశానికి భూమి తాకినట్లే కనిపిస్తుంది.. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి… ఇక రెండు తాకినట్లుగా స్పష్టంగా కనిపించే ఈ దృశ్యం చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *