telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వ మ్యాగజైన్ : .. బ్లాక్ అండ్ వైట్ ఫోటో అని.. 38 లక్షలు బూడిదపాలు..

38 laks lost on black and white photo on

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేందుకు ‘ఆంధ్రప్రదేశ్’ పేరుతో ప్రభుత్వం ఓ మాస పత్రికను నిర్వహిస్తోంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వచ్చే ఈ మాసపత్రిక జూన్ ఎడిషన్‌ ముద్రణ పూర్తయినా బయటకు రాలేక గోడౌన్‌లో మూలుగుతోంది. ఇందుకోసం ఖర్చు చేసిన రూ.38 లక్షలు బూడిద అయినట్టే. ‘ఆంధ్రప్రదేశ్’ జూన్ ఎడిషన్‌ కవర్ పేజీపై జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ‘బ్లాక్ అండ్ వైట్’ ఫొటోను ముద్రించారు. ఇది చూసిన వైసీపీ నేతలు, అధికారులు పత్రిక ఎడిటర్, సిబ్బందిపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది.

జగన్ అధికారంలోకి రావడం ఇష్టం లేనట్టు, నిరసన తెలిపినట్టు ‘బ్లాక్ అండ్ వైట్’ ఫొటో ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఆ ఫొటోకు కూడా ‘జగన్ అను నేను’ అనడానికి బదులు.. ‘జగన్ అను అతను’ అని క్యాప్షన్ పెట్టడం కూడా అధికారుల ఆగ్రహానికి కారణమైంది. దీంతోపాటు ఆ మ్యాగజైన్‌లో మరిన్ని తప్పులు ఉన్నట్టు గుర్తించిన సీఎంవో మొత్తం కాపీలను తీసుకెళ్లి గోడౌన్‌లో పడేసింది. దీనితో వీటి ప్రచురణకు అయిన రూ.38 లక్షలు వృథా అయ్యాయి.

Related posts