telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టులో పిటిషన్

జమ్ముకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ పునర్విభజన బిల్లుకు నిన్న రాజ్యసభ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును కొందరు సమర్థిస్తుండగా మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు లోక్ సభలో ఈ బిల్లు పై చర్చ కొనసాగుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి నిన్న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ విషయమై సుప్రీంకోర్టు న్యాయవాది ఎంఎల్ శర్మ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

Related posts