telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జేఎన్‌యూ హింస ఘటన.. 37మందిని పట్టుకున్నట్టు చెపుతున్న పోలీసులు..

37 caught by police in jntu delhi issue

పోలీసుల యూనివర్సిటీలో జరిగిన హింసపై విచారణ వేగవంతం చేశారు. ముసుగు ధరించి దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 37మంది విద్యార్ధులను గుర్తించారు పోలీసులు. వాట్సాప్‌ గ్రూప్‌ 37 మందిని పట్టించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ దాడిలో అనుమానితులుగా భావిస్తున్న తొమ్మిది మంది ఫోటోలను ఇప్పటికే విడుదల చేశారు పోలీసులు. అయితే మొత్తం 37 మందిని గుర్తించినట్టు చెబుతున్నారు. ఈ 37 మంది విద్యార్ధులు దాడి జరిగిన రోజే ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు. దాని ఆధారంగానే 37 మందిని గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. వీళ్లు ఏ ఒక్క ఆర్గనైజేషన్‌కు సంబంధించిన వారు కాదని, జస్ట్ స్టూడెంట్స్‌ అని చెప్పుకొచ్చారు పోలీసులు.

5న జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో పాటు వామపక్ష విద్యార్థి సంఘాలకు చెందిన వారు ఉన్నారంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ముసుగు ధరించిన దుండుగుల కోసం అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. వర్సిటీ పరిధిలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. వీటిల్లో దొరికిన ఆధారాలతో 37 మంది ముసుగు దుండుగులను గుర్తించినట్టు తెలుస్తోంది. ముసుగు దరించి గుంపులో ఉన్న యువతి కోమల్‌ శర్మ అని, ఆమె ఏబీవీపీకి చెందిన సభ్యురాలు అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై పోలీసులు మాత్రం ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. వర్సిటీ హాస్టల్‌ లోపలికి చొరబడి దాడికి దిగింది ఎవరనే దానిపై పక్కా ఆధారాలతోనే బయటకు చెప్పాలని నిర్ణయించారు.

Related posts