telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రధానిని హెచ్చరిస్తూ ఫైన్ వేసిన మహిళ…!?

Kellie-Heal

బ్రిటన్ లో మే నెలలో బ్రిటన్‌లో జరిగిన లోకల్ ఎన్నికల్లో ఓ స్కూలును పోలింగ్ స్టేషన్‌ కింద ఎన్నికల సిబ్బంది వాడుకుంది. అయితే అలా చేయడం వల్ల తన కూతురు స్కూలుకు వెళ్లకుండా ఇంట్లో ఉండాల్సి వచ్చిందని కెల్లీ హీల్ అనే మహిళ ప్రధాని థెరెసా మేకు లేఖ రాసింది. మే 2వ తేదీన తన కూతురి స్కూలును పోలింగ్ స్టేషన్ కింద వాడుకున్నారని, ఈ కారణంగా విద్యార్థులు స్కూలుకు వెళ్లలేకపోయారని, దీనికి థెరెసా మే బాధ్యత వహించి ప్రతి విద్యార్థికి 60 పౌండ్ల(రూ. 5300) ఫైన్ చెల్లించాలని లేఖలో రాసింది. 21 రోజుల్లో చెల్లించకపోతే ఆ ఫైన్ రెట్టింపు అవుతుందని కూడా పేర్కొంది. ఒకవేళ తాను చెప్పిన విధంగా ఫైన్ చెల్లించకపోతే ఎడ్యుకేషన్ యాక్ట్ కింద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా, బ్రెగ్జిట్ అంశంలో తాను రాజీనామాకు సిద్దం అంటూ థెరెసా మే ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 7వ తేదీన ఆమె రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా జరుగుతున్న యూరోపియన్ ఎన్నికల్లో బ్రెగ్జిట్ పార్టీ విజయం వైపు దూసుకుపోతోంది.

Related posts