telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాకర్‌తో కాంటాక్ట్ అయిన 33 మంది కరోనా నెగెటివ్

Shooting

లాక్‌డౌన్ మినహాయింపుల తర్వాత సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ మొదలయ్యాయి. అయితే పలువురు నటులు, సిబ్బంది కరోనా బారిన పడటంతో సినిమా, టీవీ పరిశ్రమ వర్గాల్లో కలకలం మొదలైంది. పలు షూటింగ్స్‌లో జాగ్రత్తలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో షూటింగ్స్ నిలిపివేయాలనే విజ్ఞప్తులు కూడా ఊపందుకున్నాయి. ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన సీరియల్ ప్రభాకర్‌తో కాంటాక్ట్ అయిన 33 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా ఆ 33 మందికి నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తుండటంతో ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం మరింత జాగ్రత్తలతో షూటింగ్స్ జరపాలని టీవీ పరిశ్రమ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

Related posts