telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ రాజకీయ వార్తలు

304కి చేరిన … కరోనా మృతులు..

deaths increased to 131 due to corona virus

వుహాన్ నగరంలో బయటపడిన కరోనా వైరస్ చైనా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజు రోజుకు వైరస్ తీవ్రతరం అవుతోంది. దీనిని అరికట్టాలని చైనా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ విఫలమౌతున్నాయి. మరోవైపు మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 304 మంది చనిపోగా..14 వేల మందికి వైరస్ సోకింది. దాదాపు 20 దేశాలకు కరోనా వైరస్ పాకింది. అంతర్జాతీయ కార్పొరేట్ రంగాన్ని కరోనా కలవరపెడుతోంది. చైనాలోని తమ కార్యకలాపాలను 2020, జనవరి 09వ తేదీ వరకు తాత్కాలికంగా ఉపసంహరించుకోనున్నట్లు కార్పొరేట్ దిగ్గజం ఆపిల్ వెల్లడించింది.

ఆపిల్ స్టోరులకు ఉత్పత్తులన్నీ..ఎక్కువగా వుహాన్ నుంచే వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..చైనాలో ఉన్న 324 మంది భారతీయులను సురక్షితంగా ఢిల్లీకి తీసుకొచ్చారు. ఎయిరిండియా ప్రత్యేక విమానం 2020, జనవరి 01వ తేదీ శనివారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. వుహాన్ సహా చైనాలోని వేర్వేరు యూనివర్సిటీల్లో చదువుతున్న 211 మంది విద్యార్థులున్నారు. విమానాశ్రయంలో దిగగానే..ఎయిర్ పోర్టు హెల్త్ అథార్టీ, సైనిక దళాల వైద్య సేవల విభాగం అధికారులు వారందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఢిల్లీకి సమీపంలోని మనేసర్‌లోని క్వారంటైన్‌కు తరలించారు. ప్రత్యేక వసతిలో వీరిని రెండు వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు.

Related posts