telugu navyamedia
telugu cinema news trending

టాలీవుడ్ లో కులపిచ్చి ఎక్కువ… 30 ఇయ‌ర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

Prithvi

ఇటీవల కాలంలో టాలీవుడ్ కమెడియన్ 30 ఇయ‌ర్స్ పృథ్వీ కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిపోతున్నాడు. మొన్న‌టికి మొన్న ఎల‌క్ష‌న్ స‌మ‌యంలో 30 ఇయ‌ర్స్ పృథ్వీ.. మ‌రో క‌మెడియ‌న్, కాంగ్రెస్ నేత బండ్ల గ‌ణేష్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. అంతేకాదు మెగా ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశాడు. దీంతో పృథ్వీని మెగా హీరోల సినిమాల్లోంచి తప్పిస్తారనే వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే ఆ మ‌ధ్య ఓ మెగా హీరో సినిమా నుంచి పృథ్వీని త‌ప్పించారు కూడా. అయితే సైరాలో ఈయన మంచి పాత్రే చేసాడు. అలాంటిదేం లేదని.. తనకు మెగా కుటుంబంతో మంచి అనుబంధం ఉందని చెబుతున్నాడు. ఆ త‌ర్వాత క‌మెడియ‌న్ సునీల్ రీ ఎంట్రీ త‌ర్వాత పొడిచేదేం లేదన్నాడు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీలో కులపిచ్చి కూడా ఎక్కువగా ఉందని చెప్పాడు ఈ కమెడియన్. తను పృథ్వీ అయినా కూడా చివర్లో రాజు అని తగిలించుకోవాలని చెప్పారని.. అలాగే చేసానని చెప్పాడు ఈయన. తన పేరు పృథ్వీరాజ్ అని ఉండటం చూసి కృష్ణం రాజు కూడా మోసపోయాడని.. తాము రాజులం అనుకున్నాడని చెప్పాడు. ఇక చౌదరి అని పెట్టుకుని ఉంటే ఈ రోజు తనకు ఇంకా ఛాన్సులు వచ్చేవని.. ఇక్కడ చౌదరి అని పేరు చివర ఉంటే టాలెంట్ లేకపోయినా కూడా అవకాశాలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేసాడు 30 ఇయర్స్ పృథ్వీ. ఇండస్ట్రీలో కులపిచ్చ పెరిగిపోయిందని ఘాటు వ్యాఖ్యలే చేసాడు ఈ కమెడియన్. మొత్తానికి రోజుకో విధంగా రెచ్చిపోతున్నాడు 30 ఇయర్స్ పృథ్వీ.

Related posts

మద్యం తాగి, వాహనం నడిపిన ఐఏఎస్ అధికారి .. అరెస్ట్ .. తప్పుచేస్తే..ఎవరిని వదిలేదిలేదు..

vimala p

కోహ్లీ జంటకు .. ఆటోగ్రాఫ్ ఇచ్చిన .. బుడతడు..

vimala p

ప్రేక్షకులను థ్రిల్ చేయనున్న అల్లు అర్జున్

vimala p