telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం కేసీఆర్‌

అందరూ అనుకున్నట్లే తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ‌ ఇస్తున్నట్లు అసెంబ్లీ కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్‌. కొత్త పీఆర్సీ ఏప్రిల్‌ 1 నుంచి అమలు కానున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. 9 లక్షల 17, 797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపు వర్తిస్తుందని… అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల ప్రామాణికంగా ఉపాధ్యాయుల ప్రయోషన్లు ఉంటాయని.. తెలంగాణలో పనిచేసే ఏపీ ఉద్యోగులను రిలీవ్‌ చేస్తామని హామీ ఇచ్చారు. వీఆర్‌ఏలు, ఆశా వర్కర్లకు అంగన్‌ వాడీలకూ పీఆర్సీ వర్తిస్తుందన్నారు. టీచర్ల అంతర్‌ జిల్లాల బదిలీలకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. భార్యా భర్తలు ఒకే జిల్లాలో పనిచేసుకునేలా వెసులుబాటు కల్పించారు. రిటైర్మెంట్‌ గ్రాట్యుటీ 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

Related posts