telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మూడేళ్ళ పాప వయాగ్రా తినేసింది… తరువాత…

Shadow

రష్యాకు చెందిన ఓ కుటుంబం హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి స్పెయిన్ వచ్చింది. ఇక్కడి నుంచి ఇబిజా దీవి వెళ్లిన వారు ఓ అమ్యూజ్‌మెంట్ పార్కుకు వెళ్లి సరదాగా గడుపుతున్నారు. ఇంతలో వారిలో మూడేళ్ల ఓ చిన్నారికి ఓ వస్తువు దొరికింది. అది చాక్లెట్ అనుకున్న ఆ పాప దాన్ని తినేసింది. కాసేపటికే స్పృహతప్పి పడిపోయింది. దాంతో కంగారుపడ్డ ఆమె తల్లి వెంటనే పాపను ఆస్పత్రికి తీసుకెళ్లింది. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ పాప శరీరంలో ఉత్తేజాన్ని పెంచే వయాగ్రా వంటి మందు ఉందని తేల్చారు. చిన్న పిల్లల శరీరాలు అటువంటి మందుల శక్తిని తట్టుకోలేవని, దాంతో ఆ పాప విషమ పరిస్థితిలో ఉందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. పాపకు అమ్యూజ్‌మెంటు పార్కులోనే ఆ మందు దొరికినట్లు తెలిసింది.

Related posts