telugu navyamedia
andhra political trending

ఐటీ గ్రిడ్ : విచారణ జోరు పెంచిన సిట్, 3 బృందాలు ఏర్పాటు.. !

3 special teams by sit on it grid

తెలుగురాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఓటరు లిస్ట్ నలిగిపోతుంది. మాదంటే, మాది అంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో ఓటర్ల లిస్ట్ పై తీవ్రంగా వివాదాలు చెలరేగుతున్నాయి. రాబోయే ఎన్నికల గెలుపు కోసమే ఈ తాపత్రయం అని ప్రజలకు తెలిసినా.. ఈ రచ్చ చూసి వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ మాదిరి ఫీల్ అవుతుండటం విశేషం. తాజాగా చెలరేగిన ఐటీ గ్రిడ్ వ్యవహారంలో సిట్ చీఫ్ జోరు పెంచారు. ఐటీ గ్రిడ్స్ విచారణ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డేటాను విశ్లేషించడంతో పాటు డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు.

డేటా గ్రిడ్స్ వ్యవహారంలో సాక్షులు, అనుమానితులను విచారించేందుకు మరో బృందాన్ని నియమించారు. చివరిగా ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా అనుమానిస్తున్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ ను పట్టుకోవడానికి మరో టీమ్ ను ఏర్పాటు చేశారు. అశోక్ లొంగిపోయేందుకు ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసిపోవడంతో ఆయన్ను ఏ క్షణమైనా సిట్ అధికారులు అరెస్ట్ చేయొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో సమాచారం ఇవ్వాలని గూగుల్, అమెజాన్ సంస్థలకు సిట్ అధికారులు లేఖ రాశారు.

Related posts

`పులిజూదం` చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ – మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్ లాల్‌

vimala p

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మా వ్యూ..

vimala p

ఒప్పో కే1 ..12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో..

vimala p