• Home
  • వార్తలు
  • 3 రూపాయలకే చీర…షాపింగ్ మాల్ ఆఫర్..వచ్చిన మహిళలతో బెంబేలెత్తిన యజమాని…
Trending Today వార్తలు వ్యాపార వ్యాపార వార్తలు సమీక్ష వార్తలు సామాజిక హాస్యం

3 రూపాయలకే చీర…షాపింగ్ మాల్ ఆఫర్..వచ్చిన మహిళలతో బెంబేలెత్తిన యజమాని…

3 rupees saree offer by shopping mall

రానురాను షాపింగ్ మాల్స్ ఎక్కువ అవుతున్నాయి. దీనితో ఏదో ఒక పేరు చెప్పి ఆఫర్ లు ఇస్తున్నారు షాపింగ్ మాల్స్ కూడా. కానీ ఇక్కడ సందర్బం మరి ఘోరం…3 రూపాయలకే చీర అని షాపింగ్ మాల్ ప్రకటించింది. బహుశా ఈ ప్రకటన చేసేముందు ఎవరో కొంతమంది వస్తే బాగుండు వ్యాపారం సాగుతుంది అనే ఉద్దేశ్యంతో ఇచ్చారు, కానీ తీరా ఆ సమయానికి తండోపతండాలుగా వచ్చిన మహిళలను చూసి మాల్ యాజమాన్యం నోళ్లు వెళ్ళబెట్టారు.

ఒకపక్క వచ్చే జనం మరో పక్క క్యూ లో ఉన్న జనం తో ఆ మాల్ అంతా ఇంతా హడావుడి కాదు. చీరలు ఎంచుకునే వారు చేసే హడావుడి, బయట క్యూలో ఉన్న వారు ఇంకెంతసేపు అంటూ చేసే ఒత్తిడి మధ్య మొత్తానికి నలిగిపోయిన యాజమాన్యం చేసేది లేక మాల్ ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ దెబ్బతో ఆఫర్ పెట్టింది మీరే, మాల్ మూసేసేది మీరేనా అంటూ మహిళలు సిబ్బందిని ఒత్తిడి చేయడంతో పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. కాకపోతే వారి వల్ల కూడా కాక చేతులెత్తేశారు.

మొత్తానికి 3 రూపాయల చీర పథకం పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. కానీ ఇప్పటికి అయిన రచ్చ కి ఆ మాల్ కి మంచి పాపులారిటీ వచ్చింది కాబట్టి, యాజమాన్యం అనుకున్నది ఒకరకంగా నెరవేరినట్టే. ఇంతకీ ఈ మాల్ ఎక్కడంటే, వరంగల్ నగరంలో కాసం పుల్లయ్య షాపింగ్ మాల్. ఏది ఏమైనా మహిళలా మజాకా…వారికి చీరలంటే ఎంత మక్కువో ఈ దెబ్బతో అర్ధం అయ్యిందనుకుంటాను. ఎప్పుడు మీరు చీర కొనిస్తానని మాత్రం చెప్పి చిక్కుల్లో పడకండి.

Related posts

రాష్ట్రంలో జికా వైరస్… ఇప్పటివరకు 29 పాజిటీవ్ కేసులు… అప్రమత్తంగా ఉండండి

nagaraj chanti

పవన్ లేటెస్ట్ ట్వీట్ వైరల్

admin

నయనతార కోకోకోకిల మూవీ ‘చిత్రాలు’…

chandra sekkhar

Leave a Comment